విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం తిమ్మారావుపేట సబ్ డివిజన్, వైరా డివిజన్, ఖమ్మం సర్కిల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.మాధవరావు (చైర్మన్ అండ్ మెంబర్ టెక్నికల్), ఎస్.సత్యనారాయణ (ఫైనాన్స్ సభ్యుడు)...
కారేపల్లి, నవంబర్ 11 : కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం తిమ్మారావుపేట సబ్ డివిజన్, వైరా డివిజన్, ఖమ్మం సర్కిల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.మాధవరావు (చైర్మన్ అండ్ మెంబర్ టెక్నికల్), ఎస్.సత్యనారాయణ (ఫైనాన్స్ సభ్యుడు), ఎం.రామారావు (ఇండిపెండెంట్ సభ్యుడు), విద్యుత్ శాఖ జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను సభ్యులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్ బిల్లుల్లో తలెత్తుతున్న సమస్యలు, మీటర్ల పనితీరు, కొత్త విద్యుత్ సర్వీసు కనెక్షన్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఇతర విద్యుత్ సేవలకు సంబంధించిన సమస్యలపై వినతులు సమర్పించారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ్యులు అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కొంతమంది అర్హులైన వినియోగదారులకు వర్తించకపోవడంపై చర్చించారు. వారికి కూడా పథకం వర్తింపజేసేలా కృషి చేస్తామని సభ్యులు హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వినియోగదారులు తమ ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, వివిధ గ్రామాల విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

