ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని వైన్‌షాప్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ నుండి భీమవరం గ్రామానికి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు...
ఎర్రుపాలెం, నవంబర్ 11 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని వైన్‌షాప్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ నుండి భీమవరం గ్రామానికి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా రాత్రి 10.30 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
చామనఛాయ రంగు, నలుపు రంగు నిండు చేతుల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు వెల్లడించారు. కొద్దిగా బట్టతలతో పాటు నలుపు, తెలుపు వెంట్రుకలు, గడ్డం ఉన్నట్లు తెలిపారు. కుడి భుజం, కుడి మోకాలిపై పుట్టుమచ్చలు ఉన్నాయని, ఛాతీ భాగంలో గతంలో శస్త్ర చికిత్స జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని వివరించారు. మృతుడిని గుర్తించిన వారు లేదా అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసినవారు వెంటనే ఎర్రుపాలెం ఎస్ఐ రమేష్‌కుమార్ సెల్ నంబర్ 8712659164 లేదా ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్ నంబర్ 8712659165కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

