MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
MLA Manik Rao | గత మూడు సంవత్సరాలుగా స్థానిక చక్కెర కర్మాగారం మూతపడటంతో చెరుకు రైతులు తమ పంటను కోత కోసి విక్రయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Manik Rao | జహీరాబాద్, నవంబర్ 11 : జహీరాబాద్ నియోజకవర్గంలోని చెరుకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, మాజి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర చెరుకు శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో సుమారు 49,592 ఎకరాల్లో చెరుకు సాగు జరుగుతుండగా, ఏటా 12,39,800 మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా స్థానిక చక్కెర కర్మాగారం మూతపడటంతో చెరుకు రైతులు తమ పంటను కోత కోసి విక్రయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు తమ పంటను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించుకోవాల్సి వస్తోందని, దీంతో రవాణా ఖర్చులు భారంగా మారి రైతులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. చెరుకు సాగు కోసం రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా సరైన ధర లభించక నష్టపోతున్నారని తెలిపారు.
చెరుకు పంటకు టన్నుకు రూ.4,500 చొప్పున ధర నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Read Also :
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

