‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో బ్రష్టు పట్టిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు పరిశీలకుడు తిప్పన విజయసింహారెడ్డి...
– ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రులకు వివరించాలి
– మండలిలో ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డి
– గ్రాడ్యూయేట్ ఓట్ల నమోదులో సమీక్షలో బొల్లం మల్లయ్య యాదవ్, తిప్పన విజయసింహారెడ్డి
కోదాడ, అక్టోబర్ 26 : మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో బ్రష్టు పట్టిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు పరిశీలకుడు తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ కోదాడ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదుపై నిర్వహించిన సమీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. విసిగి వేసారిన యువత తమ భవిష్యత్ కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
అయితే నియోజకవర్గంలో ప్రతి పట్టభద్రుడిని ఓటు నమోదు చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పాత ఓటర్లతో పాటు నూతన ఓటర్లను సైతం కలిసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అప్రమత్తతతో వారం రోజుల పాటు ఓట్ల నమోదుకు కంకణ బద్దులు కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను యువతలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోరాడుతారన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ బాధ్యులు, పట్టణ నాయకులు అజయ్ కుమార్, టి.రమేష్, కందిబండ సత్యనారాయణ, జానకి, రామాచారి, కోల ఉపేందర్, భూపాల్ రెడ్డి, శీలం సైదులు, వెంకటేశ్వరరావు, నయీమ్, చీమ నరేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

