– బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం
దేవరకొండ, ఏప్రిల్ 08 : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సుమారు రూ.8,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు అందించాలని కోరుతూ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పున్న వెంకట సునీత, ఎంటోజి, గిరి వెంకటయ్య గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు సహదేవు వెంకన్న, శివ గౌడ్, భిక్షమయ్య, విజయలక్ష్మి, భాషా నాయక్, శ్రీనివాస్ యాదవ్, యాదయ్య పాల్గొన్నారు.