రామగిరి, జున్ 29 : బాల సాహితీ రత్న పెండెం జగదీశ్వర్ బాల సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయమని ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ అన్నారు. నల్లగొండ ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగిన పెండెం జగదీశ్వర్ స్మారక ఆరవ జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెండెం జగదీశ్వర్ సాహిత్యాన్ని ప్రతి పాఠశాలకు చేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సమాజానికి ఉందన్నారు. జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారికి అందజేశారు. ఈ పురస్కారం కింద ఐదు వేల రూపాయల నగదు, శాలువా ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు.
పురస్కార గ్రహీత ముంజులూరి కృష్ణకుమారి మాట్లాడుతూ.. జగదీశ్వర్ పేరిట వారి స్నేహితులు పురస్కారాన్ని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో బాల సాహిత్యంలో విశిష్ట కృషి చేసిన రచయితలకు అందజేస్తుండడం అభినందనీయం అన్నారు. అకాడమీ పురస్కారం కంటే ఈ పురస్కారం గొప్పదని ప్రశంసించారు. ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్వర్ మరణం బాల సాహిత్యానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, సృజన సాహితీ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, రచయితలు పుప్పాల కృష్ణమూర్తి, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ ఉప్పల పద్మ, పెందోట సోము, దాసోజు శ్రీనివాస్, శంకర్, బాసరాజు యాదగిరి, బండారు శంకర్, శ్రవణ్ కుమార్, భీమార్జున్ రెడ్డి, మాదగాని శంకరయ్య, మోత్కూరు శ్రీనివాస్, వడ్డేపల్లి వెంకటేశ్, ముక్కామల జానకిరామ్ పాల్గొన్నారు.