భారత్, చైనా సరిహద్దు వివాదంలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సంతోష్ బాబు మూడో వర్ధంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సంతోష్ బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా నిలిచారని, రూ. 5 కోట్ల నగదుతోపాటు సంతోష్‌బాబు సతీమణికి గ్రూప్-1 ఉద్యోగం, హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చిన్న చూపు చూసినా ఇతర రాష్ర్టాల జవాన్లకు సైతం సాయం అందించి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
సూర్యాపేట టౌన్, జూన్ 15 : భారత్, చైనా సరిహద్దు వివాదంలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు త్యాగం.. చిరస్మరణీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ సరిహద్దులో ఆయన పోరాటం అజరామరంగా నిలిచిపోతుందని కొనియాడారు. కల్నల్ సంతోష్‌బాబు మూడో వర్ధంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి గురువారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అమరుడు కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో కొండంత అండగా నిలిచి ధైర్యాన్ని నింపాడన్నారు. ఆయనతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన జవాన్లకు సైతం సాయం అందించి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
కల్నల్ సంతోష్‌బాబుతో పాటు దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూసినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కున చేర్చుకుని కొండంత అండగా నిలిచిందన్నారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం తొమ్మిదేండ్లలోనే నిరంతరం అభివృద్ధి, సంక్షేమ పాలనతో పాటు అండగా నిలిచి ఆదుకోవడంలోనూ మనమే యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులతో కలిసి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడీ.భిక్షం, కౌన్సిలర్ తాహెర్ పాషా, ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీను, కక్కిరేణి నాగయ్యగౌడ్, బూర బాలసైదులు, అయూబ్‌ఖాన్ పాల్గొన్నారు.