దేవరకొండ, జనవరి 22 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దేవరకొండ పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవరకొండ ప్రాంతంలో వివిధ గ్రామాల్లో గిరిజనులు అత్యధికంగా ఉన్నందున చాలామంది గిరిజనులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం కోసం వస్తారని, అందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులు సూచించారు. సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అనంతరం వివిధ వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ జామున మాధవ్ రెడ్డి, పాప నాయక్, శ్రీధర్ రెడ్డి, గోవింద యాదవ్, డాక్టర్లు రవి ప్రకాష్, రవి, మంగ్త్ నాయక్ ఉన్నారు.