నందికొండ, జూలై 30: బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన దవాఖానలను కాం గ్రెస్ నాయకులు ప్రారంభించడమే తప్ప, దవాఖానకు వచ్చే రోగులకు వైద్య సేవ లు సరిగా అందుతున్నాయో లేదో పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే నోము ల భగత్ అన్నారు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానను గురువారం ఆయన సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దవాఖానలో వైద్యు లు ఉండటం లేదని, రోగులకు కావాల్సిన మందులు ఇవ్వడం లేదని రోగులు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.
అత్యవసర మందులకు సంబంధించిన రిజిస్టర్, ఇం డెంట్లను పరిశీలించామని, దవాఖానకు వస్తున్న మందులను వైద్యులు.. రోగులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రోగులకు కావాల్సిసిన మందులు, డాక్టర్ల కొరత లేకుండా చూసి, వైద్య సేవలు అందించామని గుర్తుచేశారు. బాలింతలకు ఇవ్వాల్సిన కేసీఆర్ కిట్, పుట్టిన పిల్లకు ఇవ్వాల్సిన టీకాలు ఇవ్వడం లేదన్నారు. సీజనల్ వ్యాధుల ప్రబలే సమయ కావడంతో డాక్టర్లు సమయ పాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
దవాఖాన చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి నియోజకవర్గంలోని పేదలకు వైద్యసేవలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చెన్ను సుందర్‌రెడ్డి, హీరేకార్ రమేశ్‌జీ, మధుబాబు, మక్సూద్, గని, విజయ్, విక్రమ్, లక్ష్మీనారాయణ, జిలాని, కోదం డం, నజీర్, శాంతకుమారి, రఫీ, లక్ష్మణ్ నాయక్, అర్జున్, మహేశ్ ఉన్నారు.