నల్లగొండ సిటీ, అక్టోబరు 11 : దసరా పండుగ పూట సొంత గ్రామాలకు వేళ్లే వారు ప్రయాణానికి అవస్థలు పడ్డారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినా అవి ప్రధాన రహదారులకు తప్ప గ్రామాలకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదిలేక ప్రైవేట్ వాహనాలను నమ్ముకున్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డీనరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం ఉండగా, ఆర్టీసీ అధికారులు ఆ బస్సులను తగ్గించి డీలక్స్ బస్సులను ఎక్కువగా నడిపిస్తుండంతో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది.