రామగిరి, జనవరి 23 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా కేవీఎస్ హెచ్క్యూ ఆదేశాలకు అనుగుణంగా ఆపరేషన్ సిందూర్ అనే అంశంపై విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. ప్రతి సంవత్సరం పరీక్షా పే చర్చా లో భాగంగా ఏదో ఒక అంశంపై కేవీలో కాంపిటీషన్ నిర్వహణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కేవీ, జేఎన్వీ, సీబీఎస్ఈ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుండి 100 మంది విద్యార్థులు, 12 మంది టీచర్స్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ జీ.శ్రీనివాసులు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీస్తాయన్నారు. పోటీల్లో విజేతలను అభినందిస్తూ బహుమతులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి టీచర్స్ ఏ.రవి కుమార్, ఆంటోనీ పాల్గొన్నారు.