కట్టంగూర్, జూలై 07 : కట్టంగూర్ చేనేత కార్మిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారి షేక్ బడేసాబ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్టంగూర్కు చెందిన నల్ల పండరి, ఉపాధ్యక్షుడిగా తాటి శ్రీనివాస్, కార్యదర్శిగా చెరుపల్లి కృష్ణయ్య, కోశాధికారిగా సంగిశెట్టి హేమలత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నల్ల పండరి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సంఘం బలోపేతానికి సభ్యుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సంఘం నాయకులు శాలువాలు, పూలమాలతో ‘సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఉబ్బని వెంకటయ్య, రుద్ర లక్ష్మమ్మ. తాటి యాదగిరి, జెల్లా శ్రీనివాసులు, ముశం యాదగిరి, సంఘం నాయకులు గంజి శంకర్ ప్రసాద్, గోళిక అంజన్ కుమార్, రాపోలు వెంకటేశ్వర్లు, చిక్కు బుచ్చిబాబు, కడారి మల్లికార్జున్, ఎలె భాస్కర్. ముశం ఉమేష్ పాల్గొన్నారు.