కట్టంగూర్, డిసెంబర్ 17 : కట్టంగూర్ మండలం పామనుగుండ్ల పంచాయతీలో భార్యాభర్తలు సర్పంచులుగా వరుసగా పగ్గాలందుకున్నారు. 2019లో పంచాయతీ ఎన్నికల్లో వడ్డె సైదిరెడ్డి గెలుపొంది గ్రామ సర్పంచ్‌గా కొనసాగారు. ప్రస్తుతం రిజర్వేషన్ జనరల్ మహిళకు రావడంతో ఆయన తన భార్య మాధవిని బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మందడి సునీతపై ఆమె 189 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త సర్పంచ్‌గా ఉంటూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాడని, మిగిలిన పెండింగ్ పనులతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. బొడ్రాయి ప్రతిష్ఠ, హనుమాన్ దేవాలయం, ఐబీ అండర్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసి వాటర్ ప్లాంట్, గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.