నకిరేకల్, జూలై 03 : నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్దన్ భారత్ సేవా విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన ”మనం ఫౌండేషన్సస ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జనార్దన్ 1996లో ఈఎం కోర్స్‌లో సోల్జర్ టెక్నికల్‌గా చేరాడు. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రక్షక్ లాంటి ఆపరేషన్లలో పాల్గొని దేశానికి సేవలందించారు. 2016లో వీఆర్ఎస్ తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు, వివిధ డిపార్ట్మెంట్లలో మోటివేషన్ క్లాసులు, వివిధ అంశాల్లో ట్రైనింగ్ ప్రొగ్రాములు నిర్వహిస్తున్నారు. ఇటీవలె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ‘పోలీసు వారి హెచ్చరిక’ మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే, నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గల త్యాగరాయ గానసభ, కళా దీక్షితుల్ హాల్లో మనం ఫౌండేషన్ నిర్వహించే 9వ వార్షికోత్సవంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.