నీలగిరి, మే9 : పాకిస్థాన్‌పై భారతదేశం యుద్ధం చేసి లాహోర్‌తోపాటు 9 ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడం పట్ల మాజీ సైనికుడిగా గర్వ పడుతున్నానని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికే పాకిస్థాన్ ప్రమాదకరంగా మారిందని నల్లగొండ పట్టణానికి చెందిన మాజీ సైనికుడు సంది పాపిరెడ్డి అన్నారు. భారత, పాకిస్థాన్ దేశాల యుద్ధం నేపథ్యంలో ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. భారత్, పాక్ బార్డర్లో ఉన్న చాలా మందికి ఆనాటి నుండే పాకిస్థానీయులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటిని ఆసరాగా తీసుకునే అక్కడ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తారు. ముస్లింలకు చిన్నతనం నుంచే పిస్టల్ నుంచి పెద్ద పెద్ద తుపాకుల గురించి వివరిస్తూ శిక్షణ కల్పిస్తారు. వారికి కావాల్సిన సౌకర్యాలు, వసతి, భోజనం లాంటివి ఏర్పాటు చేయడం వల్లే కశ్మీర్లో ఉగ్రవాదుల పెరిగిపోయారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాకిస్థాన్‌లోనే ఉగ్రవాదుల తయారవుతున్నారు. దీని వల్ల భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ముప్పు వాటిల్లే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం కశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేస్తే దానికి దీటుగా భారత్ ఢీకొని 9 స్థావరాల్లో దాడులు చేయడం గొప్ప విషయం. టెర్రరిస్టులను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును, మన సైనం ముందుకు పోతున్న తీరును దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరి సహాయ సహకారాలు లేకున్నా ముందుకు పోతున్నాం.
రెండుసార్లు పాకిస్థాన్‌ను మట్టు పెట్టే దిశగా ముందుకు పోయినం. నాటి ప్రధాన మంత్రులు ఆదేశాలు జారీ చేయడం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఎంతో మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినా అధైర్యపడకుండా ముందుకు వెళ్లి లాహోర్ దగ్గరకు చేరుకున్నాం. కానీ అప్పటి ప్రధాని ఆదేశాలతో వెనక్కి తగ్గాం. చాలా బాధపడ్డాం. ఎంతోమంది సైనిక ప్రాణాలు పోయినా ఇక్కడకు వస్తే వెనక్కి రమ్మంటే చాలా దుఃఖం వచ్చింది. ఆ ఒక్కరోజు ప్రధాని ఆదేశాలు రాకుంటే లాహోర్‌ను మట్టుపెట్టేవాళ్లం. తిరిగి 1971లో కూడా పాకిస్థాన్‌తో రెండోసారి యుద్ధం చేయాల్సి వచ్చింది. 19 రోజులపాటు వారితో బీకర యుద్ధం చేశాం. 99వేల మంది పాకిస్థాన్ సైన్యాలను గ్వాలియర్ వద్ద బంధించి తీసుకొచ్చాం. వారిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అప్పిగిస్తే మూడు నెలలు వారిని ఉంచుకుని అన్ని సేవలు అందించి పంపించారు. మాకు చాలా బాధేసింది. అప్పుడు ఎవరు సరేనన్నా ఆనాడే వాళ్లను ఖతం చేసే వాళ్లం. ఈ రోజు ఈ బాధలు ఉండేవి కాదు.
పాకిస్థాన్‌తో రెండుసార్లు యుద్ధం జరిగినా ఒంటరిపోరుతోనే ఎదుర్కొన్నాం. పాకిస్థాన్ దొంగతనంగా యుద్ధం చేయాల్సిందే తప్ప ముందుకువచ్చి నిలబడే సత్తా లేదు. పాకిస్థాన్ బలం కన్నా భారత్ బలం రెంట్టింపు ఉంటుంది. త్రివిధ దళాల్లో భారత్‌కు ఏమాత్రం సరితూగదు. భారత్‌పై దాడి చేసి ఇంచుకూడా కదుపలేదు. సింధు నది జలాలు, హిమాలయాల నీటిని పాకిస్థాన్‌కు పోకుండా చేసి అన్ని దారులు మూసేస్తేనే బాగుంటుంది.
నాటి, నేటి యుద్ధాలకు ఎంతో తేడా ఉంది. ఆనాడు తుపాకులు, బాంబులతోనే యుద్ధాలు చేసేవాళ్లం. ఇప్పుడు పెద్ద మిసైల్స్, ఎన్నో రకాల బాంబులు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు ల్యాండ్ ఫోర్స్, ఎయిర్ బ్యాగ్‌లతో దాడుల చేసేవారు. ఇవి చాలా ప్రమాదకరం. పడుకున్నా, నిల్చున్నా మరణం తప్పదు. కేవలం బంకర్లో ఉంటేనే ప్రాణాలతో మిగులుతాం. మరొకటి హెచ్‌సీఎల్ భూమి మీద పడ్డాక చెల్లాచెదురు సుమారు 20 మీటర్ల వరకు వాటి ప్రభావం ఉంటుంది. చిన్నపాటి గాజు సీసా అయినా సరే మొత్తం చీల్చుకుంటూ పేగులు బయట పడేస్తాయి. ఇంకొకటి ఏబీ షాట్.. 11 ఇంచుల ఇనుమైనా సరే చీల్చుకుంటూ వచ్చి ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి ప్రమాదకర బాంబులను ఎదుర్కొని యుద్ధాలు చేశాం. ఇప్పుడు మిసైల్తోపాటు ఎన్నో రకాల అణుబాంబులు ఉన్నాయి.