వలిగొండ, మే 11 : తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మావోయిస్టు కునపురి రాములు ఆశయ సాధకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. రాములు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం దాసిరెడ్డిగూడెంలోని స్మారక స్థూపం వద్ద ఆదివారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కునపురి రాములు, కునపురి సాంబశివుడు రాష్ట్ర సాధనతోపాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, నిరుపేదల పక్షాన చేసిన పోరాటం మరువలేనిదన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్, మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, నాయకులు మొగుళ్ల శ్రీనివాస్, పనుమటి మమత, ముద్దసాని కిరణ్‌రెడ్డి, డేగల పాండరి, కునపురి కవిత, సంజీవరెడ్డి, రమేశ్, స్వర్ణలత, మల్లేశ్, అఫ్రోజ్, శాంతికుమార్, నరేశ్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యనారాయణ, కునపురి సోదరుల అభిమానులు పాల్గొన్నారు.