నీలగిరి, జూన్ 14 : రిటైర్డ్ విద్యాధికారి, దివంగత పాదూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఎనలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని చంద్రగిరి విల్లాస్‌లో పాదూరి శ్రీనివాస్‌రెడ్డి దశ దిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి మండల విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయుడిగా అనేక సేవలందించి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినట్లు కొనియాడారు. అంతేకాకుండా ఆయన పని చేస్తున్న ప్రదేశాల్లో విద్యాభివృద్ధి కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పాదూరి ఇంద్రసేనారెడ్డి, వాసుదేవరెడ్డి, మహేందర్ రెడ్డి, గంట్ల వేణుగోపాల్ రెడ్డి, వారి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : పాదురు శ్రీనివాస్‌రెడ్డి సేవలు ఎనలేనివి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి