కట్టంగూర్, ఆగస్టు 04 : కట్టంగూర్ ఇన్చార్జి తాసీల్దార్గా పి.యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జి తాసీల్దార్గా పనిచేసిన ఎల్.వెంకటేశ్వర్రావు స్థానంలో నకిరేకల్ తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న పి.యాదగిరికి ( పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రైతులు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా దరఖాస్తులు చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డీటీ ప్రాంక్లిన్ ఆల్భట్, ఆర్ఐ కుమార్రెడ్డి, కార్యాలయ సిబ్బంది నూతన తాసీల్దార్కు శుభాకాంక్షలు తెలిపారు.