నిడమనూరు, జూన్ 26 : ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నేరవేరుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముకుందాపురం, ఇండ్లకోటయ్యగూడెం, శాఖాపురం గ్రామాల్లో ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల పక్కా ఇళ్ల నిర్మాణ పనులను గురువారం భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపిందని, లబ్ధిదారులు నిబంధనల మేరకు నిర్మాణాలను చేపట్టి, బిల్లులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్‌రెడ్డి, మంజుల శ్రీనివాస్, చేకూరి వంశీ చరణ్, సీపీఎం నాయకుడు కత్తి లింగారెడ్డి, మోసాల శ్రీను, భాగ్యలక్ష్మి, మల్లీశ్వరి పాల్గొన్నారు.