– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 750 మంది విద్యార్థులు హాజరు
– 80 మందికి ఉద్యోగావకాశాలు
రామగిరి, ఏప్రిల్ 04 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 15 మల్టీ నేషనల్ కంపెనీలతో నిర్వహించిన మేళాకు యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు ఆయా కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్న 750 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆయా కంపెనీల ఆధ్వర్యంలో ఉదయం రాత పరీక్షలు నిర్వహించి షార్ట్ లిస్ట్ చేశారు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించగా 80 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

ఎంజీయూలో జాబ్ మేళాకు విశేష స్పందన
ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన అభ్యర్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు సబ్జెక్ట్ పెంచుకోవాలని సూచించారు. ఎంపికైన వారందరికీ అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ కె.హరీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, టాస్క్ కో ఆర్డినేటర్ ప్రదీప్ రెడ్డి, యూనివర్సిటీ వివిధ విభాగాల అధికారులు, ఆయా కంపెనీల హెచ్ఆర్ లు పాల్గొన్నారు.

ఎంజీయూలో జాబ్ మేళాకు విశేష స్పందన