రైతన్నల రక్తతక్పణం
నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. పంటలకు నీళ్లడిగితే బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్ని పంటలపై చల్లాలని రేవంత్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- రక్తంతో పంటలు పండించుకోవాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
- నీళ్లు లేక పంటలపై నెత్తురు చల్లిన సేవాలాల్ తండా రైతులు
- రక్తంతో పండిన పంటను రేవంత్‌కే పంపుతాం
- రక్తపు కూడు తిని మరో నాలుగు రోజులు ఎక్కువ బతుకు..
- సూర్యాపేట జిల్లా పందిబండ తండాలో ఘటన
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వీడియోలు
చివ్వెంల, జూలై 14 : నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. పంటలకు నీళ్లడిగితే బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్ని పంటలపై చల్లాలని రేవంత్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి చుక్క నీటికి నోచుకోని సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతో నీళ్లు వస్తే దాదాపు ఏడెనిమిదేండ్ల పాటు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నామన్నారు.
ప్రభుత్వం మారినంక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎట్లు ఉంటదో ఇవ్వాళ తెలిసొచ్చిందని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండా గిరిజనులు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటలకు నిరసనగా బుధవారం తమ నెత్తురు తీసి పొలంలో చల్లి నిరసన వ్యక్తం చేశారు. తమ రక్తం చూసైనా కేసీఆర్ సార్ మాదిరి వెంటనే పొలాల్లో నీళ్లు పారించాలని డిమాండ్ చేశారు.
సేవాలాల్ తండా మాజీ సర్పంచ్ గుగులోతు కవితా అనిల్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు తమ రక్తం తీసి పొలంలో చల్లారు. రేవంత్ అన్నట్లు రక్తంతో పంటలు పండితే పండిన పంటలను ఆయనకే పంపిస్తామని, రక్తపు కూడు తిని ఆయన మరో నాలుగు రోజలు ఎక్కువ బతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంతా తమ రక్తాన్ని పొలాల్లో చల్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుగులోతు వెంకన్న, మాన్సింగ్, బోడియా, బుజ్జి, మస్రూ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనపై కడుపు మండిన రైతులు తమ నెత్తురు చిందించి పాలకులకు బుద్ధి చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

