చండూరు, జూన్ 19 : మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుందని, అది యోగాతో సాధ్యం అవుతుందని బీజేపీ నల్లగొండ జిల్లా నాయకుడు మాదగోని నాగార్జున అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణంలో యువకులు, సీనియర్ సిటిజన్స్, మహిళలతో పాటుగా ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలన్నారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలన్నారు. యోగా అభ్యసన ద్వారా మనం మన జీవనశైలిని మార్చుకోవచ్చని తెలిపారు.