దేవరకొండ, జనవరి 03 : అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, శాసన సభ స్పీకర్‌ది హేయమైన బుద్ధి అన్నారు. మూసీ పునరుద్ధరణ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష కోట్లు కమీషన్ గురుంచి తహతహలాడుతున్నరని మండిపడ్డారు. రైతులు యూరియా గురించి బాధ పడుతుంటే సీఎం మూసీ ప్రక్షాళన గురించి ప్రస్తావించడం దారుణం అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కృష్ణా బేసిన నీళ్లు అక్రమంగా తీసోకుపోతుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చేప్పేదాక సోయి లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అని దుయ్యబట్టారు. నీళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డికి గానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గానీ కనీస అవగాహన లేదని విమర్శించారు. కృష్ణా నీటి గురించి త్వరలో తమ నాయకుడు కేసీఆర్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండలో భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ప్రణాళిక పూర్తైందని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బిల్య్ నాయక్, గాజుల ఆంజనేయులు, టీవీఎన్ రెడ్డి, శంకర్ నాయక్, నిల రవి, రాజు, కృష్ణ, సుభాష్ గౌడ్ పాల్గొన్నారు.