శుద్ధ జలం.. ఏది నిజం!.. ప్యూరిఫైడ్ పేరుతో నీరు గారుతున్న ప్రమాణాలు
జిల్లాలో నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రోడ్డు పక్కన ఏ చిన్న హోటల్‌కు వెళ్లినా బాటిల్ నీళ్లిచ్చి రూ. 5 అడిగి మరీ వసూలు చేస్తున్నారు.
- ప్రజారోగ్యంతో వ్యాపారుల చెలగాటం
- పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కేంద్రాలు
- రోగాల బారిన పడుతున్న జనం
- నిబంధనలు గాలికొదిలేస్తున్న నిర్వాహకులు
నేరేడుచర్ల, ఏప్రిల్ 2: జిల్లాలో నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రోడ్డు పక్కన ఏ చిన్న హోటల్‌కు వెళ్లినా బాటిల్ నీళ్లిచ్చి రూ. 5 అడిగి మరీ వసూలు చేస్తున్నారు. అంటే ఒకరు రోజుకు ఆరు సార్లు నీరు తాగాల్సి వస్తే నెలకు రూ. 9 వందలు కేవలం నీటి కోసమే వెచ్చించాల్సిన దుస్థితి. ఇదిగాక ఇళ్లకు తెప్పించుకునే 20 లీటర్ల క్యాన్లు అదనం. రోజూ ఏ నీరు తాగుతున్నారని ఎవరైనా అడిగితే మినరల్ వాటర్ అని గొప్పగా చెబుతాం. అది నిజంగా మినరల్ వాటరేనా అని అడిగితే కొంచెం అనుమా నం రాక మానదు. అవి కేవలం శుద్ధ జలం (ఫిల్టర్ వాటర్) మాత్రమేనని తెలుసుకునే సరికి జేబులు ఖాళీ అవుతున్నాయి.
ఇందులోనూ నీళ్లు పాక్షికంగానే శుద్ధి జరుగుతోందనే వాస్తవాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. ఇండ్ల లో, వీధుల్లో నల్లాలున్నా అందరూ ఆ నీటిని వాడుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నారు. ఎందు కంటే తాగునీటిపై ఏ మాత్రం ఆశ్రద్ధ వహించినా రోగాల బారిన పడినట్లే. గొంతెండుతున్న జనం గోస పట్టించుకునే నాధుడే లేకపోవటంతో ఇదే అదనుగా జిల్లా లో రివర్స్ ఆస్మాసిస్(ఆర్వో) ప్లాంట్ల ద్వారా తాగు నీటి వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోం ది. అయితే కొన్ని శుద్ధజలాల ప్లాంట్ల నిర్వాహకులు కనీస ప్రమాణాలు పాటించకుండా నీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఎంపిక ఇలా..
రక్షిత నీటిని జిల్లా వాసులకు సరఫరా చేయాల్సిన సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా మారుమూల ప్రాంతాల వారు సైతం ఆర్వో ప్లాంట్ల ద్వారా విక్రయిస్తున్న శుద్ధ జలాన్నే కొనుక్కుని తాగాల్సి వస్తోంది. నిజానికి గ్రామాల్లో నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు కడిగి క్లోరినేషన్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. దాదాపు అన్ని పంచాయతీల్లోనూ ఈ కార్యక్రమాన్ని విస్మరించారు. దీంతో జనం తాగునీటిని కొనుగోలు చేసి, తాగాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని జిల్లాలో పట్టణ కేంద్రాలు మొదలుకొని మారుమూల గ్రామాల్లో సైతం విచ్చలవిడిగా శుద్ది జల ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.
శుద్ధ జలం సురక్షితమేనా?
శుద్ధ జలం విక్రయదారులు చాలా మంది తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంలో కనీస అవగాహన లేని వారు సైతం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నీటిలోని వివిధ రసాయనాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఎస్ఐ) నిర్ధారిస్తుంది. అలా నిర్ధారించిన మేరకు నీటిలో ఆయా పదార్ధాలుంటే శుద్ధజలం (ప్యూరిపైడ్) గా పరిగణించాలి. ప్రతి ప్లాంట్ వారు సూక్ష్మ జీవ ప్రయోగశాల (మైక్రో బయాలజీ ల్యాబ్)లో ప్రతి రోజూ నీటిని పరీక్షించాల్సి ఉంటుంది. జిల్లాలో ఒకటి, రెండు ప్లాంట్లు తప్ప పూర్తిస్థాయిలో ప్రయోగశాలలే లేవు.
ప్లాంట్‌లోకి నీరు ఇలా..
ముందుగా బోరుబావి నీటిని ఒక ట్యాంకులోకి తీసుకుంటారు. దాని నుంచి మోటరు ద్వారా ఫిల్టర్‌లోకి పంపుతారు. ఇక్కడ నీళ్లలోని నలకలు, బురద, ఇసుక వంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది. ఆ తరువాత ఈ నీళ్లు కార్బన్ ఫిల్టర్‌కు పంపిస్తారు. నీళ్లలోని రంగు, చెడు వాసనకు ఈ ఫిల్టర్ చెక్ పెడుతుంది. అక్కడ నుంచి ఆర్వో ఫిల్టర్‌లోకి మోటరు ద్వారా నీళ్లు వస్తాయి. ఇక్కడ అసలైన పక్రియ ప్రారంభమౌతుంది. ఇందులో అతి సూక్ష్మాతి సూక్షమైన బాక్టీరియా, వైరస్‌ను ఒక ఫిల్టర్ వేరు చేస్తుంది. రెండో ఫిల్టర్ నుంచి మంచి నీరు విక్రయానికి సిద్ధంగా ఉన్న ట్యాంకులోకి పంపుతుంది. ఈ విధానంలో ఫిల్టర్లు ఎక్కువకాలం మన్నికగా ఉండేందుకు, నీళ్లు రుచిగా అనిపించేందుకు హెచ్‌టూవో వంటి కొన్ని రసాయనాలు కలుపుతారు.
సరిగా శుద్ధి చేయకుండానే..
భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చాలా మంది ఫ్యూరిఫైడ్ వాటర్ మీదనే ఆధారపడుతున్నారు. జనం ఎక్కువ మొత్తంలో ఈ నీటినే తాగుతుండటంతో వాటర్ ప్లాంట్ల యజమాన్యాలు సరైన పద్ధతిలో నీటిని శుద్ధి చేయకుండానే విక్రయిస్తున్నారు.
ప్లాంట్ల నిబంధనలు ఇలా..
శుద్ధ జల ప్లాంట్లు పెట్టాలంటే బీఎస్ఐ అనుమతి తీసుకోవాలి. అలాగే ఆహార కల్తీ నిరోధకశాఖ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అమ్మకం పన్ను, జిల్లా పరిశ్రమల శాఖతో పాటు స్ధానికంగా ఉన్న మున్సిపల్, పంచాయతీ అధికారుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలి. అయితే ఏ అనుమతి లేకుండానే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ కొందరు అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నారు.
నీటిని ఇలా శుద్ధి చేయాలి..
తాగునీటిలో లవణాలు ఎక్కువై నా, తక్కుకైనా ఆరోగ్య సమస్యలు వస్తా యి. ఆర్వో ప్లాంట్‌లో ఫిల్టరింగ్ విధానంలో క్రిములతో పాట అవసరమైన లవణాలు కూడా బ యటకు పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు నిపుణులతో పరీక్షలు చేయించి, అవసరమైన లవణాలు బయటకు పోకుండా జాగ్రత్తపడాలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

