DU professor : ఇటీవల జరిగిన ఢిల్లీ ప్రొఫెసర్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేవేస్మితా పాల్ అనే మహిల హత్యకు గురైంది.
ఢిల్లీలోని వసుంధరా ఎన్‌క్లేవ్‌లోని తన అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో గత గురువారం హత్యకు గురైంది. ఈమెకు, ఒక దంపతులకు మధ్య ఒక ఫ్లాట్‌కు సంబంధించి వివాదం నడుస్తోంది. దేవోస్మితకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక ఫ్లాట్ ఉంది. అది ఆమె తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చింది. అక్కడ ఆ ఫ్లాట్‌ను వారు దంపతులకు అద్దెకు ఇచ్చారు. కొన్నాళ్లుగా వారు అక్కడ అద్దెకు ఉంటున్నారు. ఆ ఫ్లాట్ బాగా నచ్చిన ఆ దంపతులు దాన్ని కొనాలనుకున్నారు. ఈ విషయం యజామాని అయిన దేవోస్మితకు, ఆమె సోదరులకు చెప్పారు. వారంతా దీనికి అంగీకరించారు. ఆ ఫ్లాట్ అమ్మాలని డిసైడ్ అయ్యారు. అది కోట్ల విలువ ఉంటుంది.
ఆ కుటుంబంలో దేవోస్మిత మినహా అందరూ ఫ్లాట్ అమ్మేందుకు అంగీకరించారు. కానీ, దాన్ని ఎట్టిపరిస్థితుల్లో అమ్మేది లేదని దేవోస్మిత తేల్చి చెప్పింది. తాము ఫ్లాట్ కొనడానికి ఏకైక అడ్డంకిగా ఉన్న దంపతులు.. దేవోస్మితను హత్య చేశారు. మాస్కులు ధరించి, లిఫ్ట్ వాడకుండా మెట్లమార్గం గుండా ఆమె ఫ్లాట్‌లోకి చేరుకుని, ఆమెను హత్య చేశారు. వారు ఫ్లాట్‌లోకి వెళ్లడం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. నిందితులైన దంపతులను గుర్తించి అరెస్టు చేశారు.