అమరావతి : ఏపీలో వందేభారత్ ఎక్స్ప్రెస్ ( Vande Bharat Express ) కు తృటిలో ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న రైలు హిందూపురం స్టేషన్( Hindupuram Express ) వద్ద రెండు ఆవులను ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్ధం రావడం వల్ల లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక కాసేపు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గుర్తించిన రైల్వే సిబ్బంది ఆవుల కళేబరాలను పట్టాల నుంచి తొలగించారు. అరగంట తరువాత వందేభాతర్ ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి బయలు దేరింది.