Gold price : దేశంలో బంగారం ధరలు (Gold price) వరుసగా మూడో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా డిమాండ్ మందగించడంతో పసిడి ధరలు దిగివస్తున్నాయి. జూన్ 7 నాటి ట్రేడింగ్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.300 తగ్గి.. రూ.1,52,730 వద్దకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2.7 లక్షలుగా నమోదైంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే.. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,54,910గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,000గా ఉంది. ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,55,910గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది. శనివారం భారత మార్కెట్లో మేలిమి బంగారం సగటు ధర రికార్డు స్థాయిలో రూ.3,000 మేర తగ్గగా.. వెండి ధరలోనూ రూ.10 వేల మేర తగ్గుదల నమోదైంది.