కోదాడ, ఆగస్టు 22 : ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేసి జీవించే హక్కును పరిరక్షించాలని పిడిఎం రాష్ట్ర నాయకుడు మొగిలిచర్ల అంజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ 24న వరంగల్‌లో నిర్వహించే సభా పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆదివాసీలకు జీవించే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని విమర్శించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను విస్మరిస్తుందన్నారు.
ఆదివాసీల సాంస్కృతిక జీవన వ్యవస్థ ధ్వంసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు, ఎం ఎస్ కళాశాలల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు ఒక్కంతుల నరసింహారావు, ఉదయగిరి, సిపిఎం నాయకుడు ముత్యాలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీం, ప్రెస్ క్లబ్ జిల్లా మాజీ అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్, పందిరి ఫౌండేషన్ బాధ్యుడు ఎస్ఎస్ రావు, చలిగంటి రామారావు, మామిడి రామారావు, కర్ల సుందర్ బాబు, కాసాని గురులింగం పాల్గొన్నారు.