పెన్‌పహాడ్, జూన్ 09 : ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్‌వర్మ అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తలపెట్టిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనను నాలుగులపాటి అన్నారం గ్రామంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దండకారణ్యంలోని లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను బడా కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీలను అక్కడి నుంచి గెంటివేసేందుకే నిశ్చయిoచుకున్న కేంద్రం మావోయిస్టులను సాకుగా చూపి ఆపరేషన్ కంగార్ మొదలు పెట్టిందని పేర్కొన్నారు.