మిర్యాలగూడ, నవంబర్ 21: యువకులు అర్థరాత్రి రోడ్లపై అకారణంగా కనిపిస్తే చర్యలు తీసుకుంటామని వన్ టౌన్, టూ టౌన్ సీఐలు కరుణాకర్, నాగార్జున హెచ్చరించారు. ఆపరేషన్ చబుత్రాలో భాగంగా డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారణం లేకుండా రోడ్లుపై తిరుగుతున్న 32 మందిని పట్టుకొని 26 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి అకారణంగా రోడ్లపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐలు బి.సుధీర్‌కుమార్, బి.రాంబాబు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.