– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ 16వ వార్డులో మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కౌన్సిలర్ అభ్యర్థి కరీముల్లా బాబా విద్యావంతుడని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాడన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆపద సమయంలో ఆదుకునే నాయకుడు అని, వార్డు ప్రజల కష్ట కష్టాల్లో కరీముల్లా భాగం పంచుకుంటాడన్నారు. కారు గుర్తుకు ఓటేసి కరిముల్లాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నయీమ్, నాయకుడు తీగల కరుణాకర్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.