సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు చేపడుతున్నారు.
నందికొండ, ఆగస్టు 13: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు చేపడుతున్నారు. శ్రీశైలం నుంచి 2,68,876 క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుండడంతో, నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల (8 గేట్లు 10 అడుగులు, 18 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి ) ద్వారా 2,61,732 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను చేపడుతామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 ( 312.0450 టీఎంసీలు) అడుగులకు గానూ 588.80 (308.4658 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడి కాల్వ ద్వారా 4050 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,664 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్ కేంద్రాలు, కాల్వల ద్వారా 2,96,246 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ఎడమ, వరద కాల్వకు నీటి విడుదలను నిలుపుదల చేయగా, కుడికాల్వలకు నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు తగ్గించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

