మిర్యాలగూడ, ఫిబ్రవరి 21 : పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ నందిపాడు బైపాస్ వద్ద వేగంగా వస్తూ శరణ్య గ్రీన్హోమ్స్ నుంచి అప్పుడే రోడ్డు మీదకు బైక్పై వస్తున్న పి.భరతయ్య(75)ను ఢీకొట్టింది.
అనంతరం ముందు ఉన్న డీసీఎం, ఆటో, మరో డీసీఎంను వరుసగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనాలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. బైక్పై వెళ్తున్న భరతయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కంటైనర్ డ్రైవర్ రితేశ్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భరతయ్య మృతదేహాన్ని ఏరియా దవాఖానకు తరలించారు. టూటౌన్ సీఐ నాగార్జున కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.