కట్టంగూర్, జనవరి 03 : రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. శనివారం కట్టంగూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు హెల్మెట్లు ధరించడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించి వేగ పరిమితులు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో పాటు ఫోన్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమన్నారు. రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మునాస సత్యనారాయణ, సతీశ్ పాల్గొన్నారు.