గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచక అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు గురైన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అభ్యర్థనతో సీఎం కేసీఆర్ ఐదేండ్లలో నియోజకవర్గానికి రూ.2,526 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 5 మండలాలు, మిర్యాలగూడ మున్సిపాలిటీని ప్రగతిపథంలో ముందుంచారు.
సీఎం కేసీఆర్ అండదండలతో ఎమ్మెల్యే భాస్కర్‌రావు దామరచర్ల, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల పరిధిలో ఐదు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించారు. వీటి నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించారు. కేశవపురం- కొండ్రపోల్ లిఫ్ట్-1, బొత్తలపాలెం- వాడపల్లి లిఫ్ట్-2, దున్నపోతులగండి-చిట్యాల చాంప్లాతండా లిఫ్ట్ట్-3, వీర్లపాలెం లిఫ్ట్ట్-4 పనులు వేగంగా జరుగుతున్నాయి. తోపుచర్ల లిఫ్ట్‌కు రూ.9.90 కోట్ల నిధులు మంజూరు కాగా, పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే 50 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా మండలాలతోపాటు మిర్యాలగూడ మున్సిపాలిటీలో సుమారు రూ.300 కోట్లతో బీటీ, సీసీ రోడ్లు, మినీ కల్వర్టులు నిర్మించారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలతోపాటు అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు వేశారు.
మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల్లో రూ.18 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న మినీ రవీంద్రభారతిని రూ.9.80 కోట్లతో నిర్మించారు. జ్యోతిరావుపూలే భవనం రూ.1.25 కోట్లు, సంత్ సేవాలాల్ భవనం రూ.1.25కోట్లు, అంబేద్కర్ భవనం రూ.1.25కోట్లతో నిర్మించారు. రాజీవ్‌చౌక్ నుంచి వై జంక్షన్ వరకు రూ.21 కోట్లతో వంద ఫీట్ల బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.1.67 కోట్లతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేశారు. రూ.72 లక్షలతో పట్టణంలోని పలు కూడళ్ల వద్ద పబ్లిక్ టాయిలెట్లు నిర్మంచారు.
అదేవిధంగా టీఎస్పీ, సీడీపీ నిధులు రూ.4 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ దీపాలు, 9వేల నివాసాలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించారు. షాదీఖానా, స్లాటర్ హౌజ్, హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులను రూ.61 కోట్లతో చేపట్టారు. రోడ్లను శుభ్రం చేసేందుకు రూ.42 లక్షలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. అమృత్ పథకం కింద తాగునీటి సరఫరా పైపులైన్ల నిర్మాణాన్ని రూ.173 కోట్లతో చేపట్టారు. పట్టణం మీదుగా వెళ్తున్న కోదాడ- జడ్చర్ల రహదారి నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి రూ.126 కోట్ల నిధులు మంజూరు కాగా పనులు చేపట్టారు.
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని జిల్లా కేంద్ర దవాఖానగా మార్చేందుకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కృషితో ఇప్పుడు ఉన్న వంద పడకలకు తోడుగా మరో వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడ డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో ప్రతిరోజూ 30మంది డయాలసిస్ చేయించుకునే అవకాశం లభించింది. దీంతోపాటు ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ 600 మందికి పైగా వివిధ రకాల వ్యాధులతో వైద్య చికిత్సలు చేయించుకునేందుకు వచ్చి వెళ్తుంటారు.
దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.30 వేల కోట్లతో దేశానికే తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)ను నిర్మిస్తున్నారు. 4,276 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతున్నది. మరో 6 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే 4 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానున్నది. ఈ పవర్ స్టేషన్లో ఐదు బాయిలర్లు ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ఐదు యూనిట్లు 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.
నియోజకవర్గవ్యాప్తంగా రూ.54 కోట్లతో రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంక్ అందించారు. గతంలో శ్మశానవాటికలు లేక ఇబ్బంది పడ్డ ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకుంఠధామాలతో ఆఖరి మజిలీ చింత తీరింది.
నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు మంజూరు చేశారు. సుమారు రూ.10 కోట్లతో 50 నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు వరకు నేను ఎమ్మెల్యేగా అనేక పథకాలతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. దేశంలోనే అతి పెద్ద మెగా థర్మల్ పవర్ ప్లాంట్(వైటీపీఎస్)ను సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ పవర్ ప్లాంట్‌తో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుది. ఐదు లిఫ్టుల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించా. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ అండదండలతో మరింత అభివృద్ధి చేస్తా.
– నల్లమోతు భాస్కర్‌రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే