గుట్టలో ఘనంగా లక్షపుష్పార్చన
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. సోమవారం స్వామి, అమ్మవార్ల సహస్ర నామ పఠనంతో అర్చక బృందం, వేద పం డితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మం డపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదిక పై తీర్చిదిద్దారు.
యాదగిరిగుట్ట, డిసెంబర్ 15: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. సోమవారం స్వామి, అమ్మవార్ల సహస్ర నామ పఠనంతో అర్చక బృందం, వేద పం డితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మం డపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదిక పై తీర్చిదిద్దారు.
అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్ర నామ పఠనంతో వివిధ రకాల పూలతో పాంచరాత్రగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్షపుష్పార్చన చేశారు. తెల్లవారు జామునే ఆలయం తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నరసింహస్వామి వారిని మేల్కొలిపారు. తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. శ్రీస్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయస్వామివారికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాల ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. సాయంత్రం వేళలో శ్రీస్వామివారికి తిరువీధిసేవ, దర్బార్సేవ అత్యంత వైభవంగా చేపట్టారు.
రాత్రి వేళలో శ్రీస్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు నిర్వహించారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉద యం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.20,88,907 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో వెంకట్రావు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

