ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
తన గెలుపును కోరుతూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. శనివారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. తనను గెలిపించేందుకు సైనికుల్లా శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, డిసెంబర్ 2 : తన గెలుపును కోరుతూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. శనివారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. తనను గెలిపించేందుకు సైనికుల్లా శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గ వ్యాప్తంగా 86.67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఒకవైపు పోలింగ్ కొనసాగతున్నప్పటికీ సాయంత్రం ఐదున్నర గంటలకే కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేయడం ద్వారా ఓటర్లు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ పెద్దలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఓటర్లు తనపై నమ్మకంతో ఓటేసినట్లు వివరించారు.
బోగస్ ప్రచారాలను నమ్మి అభిమానులు, కార్యకర్తలు మనోధైర్యం కొల్పోవద్దని సూచించారు. నియోజక వర్గ వ్యాప్తంగా జరిపిన సర్వేలో నూటికి నూరుశాతం నకిరేకల్‌లో బీఆర్ఎస్ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేసిన పోలీసులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

