చౌటుప్పల్ రూరల్, జూన్22 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలో పింఛన్ల కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ ఎప్పుడిస్తారా అని వృద్ధులు, వితంతువులు రోజూ పాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు.
శనివారం కూడా పింఛన్ కోసం వచ్చి రాలేదని తెలియడంతో ఇలా నిరాశతో కనిపించారు. 22వ తేదీ వచ్చినా ఇంకా పింఛన్ ఇవ్వకపోవడంతో రోజువారీ ఖర్చులకు ఇబ్బంది అవుతున్నది వారు వాపోతున్నారు. గత ప్రభుత్వం ప్రతినెలా సమయానికి పింఛన్ ఇచ్చేదని, ఇప్పుడు నెల పూర్తి కావస్తున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.