కోదాడ, ఆగస్టు 30 : విశ్రాంత ఉద్యోగులు సమస్యలకు దూరంగా ఉంటూ, వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్లో ఆగస్ట్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల సామూహిక పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందంగా, సంతోషంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి.బొల్లు.రాంబాబు, అమృత రెడ్డి, రఘువర ప్రసాద్, విద్యాసాగర్, పొట్ట జగన్మోహన్ రావు, హనుమారెడ్డి, భ్రమరాంబ, శోభ, గడ్డం. నరసయ్య, ఖలీల్ అహ్మద్, భిక్షం పాల్గొన్నారు.