చందంపేట, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు సమయ పాలన పాటించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం చందంపేట మండలంలోని పీహెచ్సీని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బంది సమయ పాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చందంపేట మండలంలోని గాగిల్లాపురం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఇళ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను సూచించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, తాసీల్దార్ శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ డీఈ లింగారెడ్డి, రాజు ఉన్నారు.