రామగిరి, డిసెంబర్ 15 : నాటక రంగాన్ని ప్రొత్సహించి నేటి యువతను భాగస్వామ్యం చేయాల్సి అవసరం ఎంతైన ఉందని ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. నల్లగొండకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, నాటక రచయిత గజవెల్లి సత్యం రచించిన ‘ఓ మహిళా మేలుకో’ నాటికల సంపుటిని ఆయన ఆల్ ఇండియా ఫెన్షనర్స్ ఫెడరేషన్ కార్యదర్శి డి.సుధాకర్‌తో కలిసి సోమవారం జిల్లా సిస్టవర్స్ భవనంలో ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాటికలు ప్రయోజనాత్మకంగా, ప్రభావాత్మకంగా ఉంటాయన్నారు.
ప్రముఖ జాతీయ సినీ అవార్డు గ్రహీత, రచయిత, సంగీత విద్వాంసులు డా.పురుషోత్తమాచార్యులు, ప్రపంచ ఉపాధ్యాయ సంఘ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎంవీ గోవారెడ్డి మాట్లాడుతూ.. నాటక సంపుటిలో వరకట్నం బాధితులు, ర్యాగింగ్‌కు బలవుతున్న యువత గురించి బాగా రాశారని కొనియాడారు. అనంతరం పుస్తక రచయిత గలవెల్లి సత్యంను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జిల్లా శ్రీశైలం, గాయం నారాయణరెడ్డి, నల్లగొండ యూనిట్ ప్రధాన కార్యదర్శి యాదా వాసుదేవ్, కోట్ట రామలింగం, మారోజు కేశవాచారి, టి.రమేశ్ పాల్గొన్నారు.