నల్లగొండ సిటీ, జూన్ 17 : కనగల్ మండలం దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు సోమవారం పరిపూర్ణమయ్యాయి. చివరి రోజు ఉదయం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఏకాంతసేవతోపాటు ఆలయం వద్ద 108 కలశాలతో అష్టోతర శతఘాభిషేకం, హోమాలు, త్రిశూలస్నానం, బలిహరణ, మహపూర్ణ, అవబృధం నిర్వహించారు.
సాయంత్రం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల నుంచి పెద్దఎత్తున బోనాలను పరశురాముడి విగ్రహం వద్దకు తీసుకొచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఈఓ జయరామయ్య, సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య, దేవాలయ మాజీ చైర్మన్లు కరుణాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్నగాని నాగేశ్‌గౌడ్, ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రావణ కుమారాచార్యులు, సుదర్శనాచార్యులు, గాదె మహేశ్, దామోదరరావు పాల్గొన్నారు.