చండూరు, జూన్ 24 : విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఆర్థిక ప్రోత్సాహం అందించారు. పదో తరగతి ఫలితాల్లో చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ టాపర్ సరిపెల్లి మోనికకు రూ.5 వేలు, ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఎంపికైన సంగెపు రాఘవేంద్రకు రూ.5 వేలను ఎన్ఆర్ఐ అందజేశారు. అమెరికాలో స్థిరపడిన కనగల్ మండలం రాయిబావిగూడెం గ్రామానికి చెందిన నంద్యాల కిరణ్‌కుమార్‌రెడ్డి నగదు ప్రోత్సాహకాన్ని పాఠశాల హెచ్ఎం ఎడ్ల భిక్షం ద్వారా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మరబోయిన సైదులు, ఉపాధ్యాయురాలు కట్ట మమత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.