రామగిరి, మే 09 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన ఫార్మసీ కళాశాలలో పార్ట్‌టైం అధ్యాపకుల నియామకానికి రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫార్మకాలజీ, ఫార్మకాప్నిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మసిటిక్స్ సబ్జెక్టుల్లో పీహెచ్డీ, నెట్, గేట్, జిపాట్ అర్హతతో పాటు బోధన అనుభవం కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 15 లోగా సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.