Nosh Pharma Lab : మృతుడి కుటుంబానికి రూ.1.50 కోట్ల పరిహారం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లలోని నోష్ ఫార్మా ల్యాబ్‌లో శుక్రవారం రియాక్టర్ పేలిపోవడంతో ఒక కార్మికుడు బొడ్డు బాలకృష్ణ (30) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుడు బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి..
నల్లగొండ, మే 02 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లలోని నోష్ ఫార్మా ల్యాబ్‌లో శుక్రవారం రియాక్టర్ పేలిపోవడంతో ఒక కార్మికుడు బొడ్డు బాలకృష్ణ (30) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుడు బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి కంపెనీ యాజమాన్యం రూ.1.50 కోట్లు నష్ట పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. గాయపడ్డ వారిలో నలుగురు స్వల్ప గాయాలతో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ముగ్గురు కార్మికులు ప్రస్తుతం అపోలో డీఆర్డీఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నోష్ ఫార్మాలో నెల రోజుల వ్యవధిలో ఈ యూనిట్లో ఇది రెండవ ప్రమాదం. మార్చి 9న జరిగిన ఇలాంటి పేలుడులో ఇద్దరు కార్మికులు గాయపడడంతో భద్రతా నిబంధనల పాటింపుపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. తాజాగా కంపెనీ మూడో బ్లాక్‌లో రియాక్టర్‌లోకి ముడి పదార్థాలను నింపుతుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

