రామగిరి, మే 02 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు కె.రాజేశ్వరి, డి.మానిశా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరీటికల్ సైన్సెస్ (ICTS) నందు సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. వీరు జూన్ 8 నుంచి 19వ తేదీ వరకు బెంగళూరు నందు శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ వెంకట్ రెడ్డి, అధ్యాపక బృందం డాక్టర్ మధుకర్ రెడ్డి, కనకయ్య, మథిన్ హుస్సేన్, బాల కార్తీక్ అభినందనలు తెలిపారు.