హాలియా, అక్టోబర్ 1 : అనుముల మండలం పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. 2014 కు ముందు పేరూరు పంచాయతీ పరిధిలో మదారిగూడెం, ఆంజనేయతండా, పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డతండా ఆవాస గ్రామాలుగా ఉండేవి. 2014లో తెలంగాణ ఏర్పాటైన తరువాత పేరూరు పంచాయతీ నుంచి విడిపోయి మరో రెండు కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. అందులో వీర్లగడ్డతం డా, ఆంజనేయతండా, పుల్లారెడ్డి గూడెం గ్రామాలను కలిపి వీర్లగడ్డ తండా పంచాయతీ ఏర్పాటు చేయగా, పేరూరు నుంచి మదారిగూడెం గ్రామాన్ని వేరుచేసి మరో నూతన గ్రామ పంచాయతీ ఏర్పా టు చేశారు. అయితే పేరూరులో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కరూ లేరు.
గతంలో పేరూరు పంచాయతీలో అవాస గ్రామంగా ఉన్న వీర్లగడ్డతండాకు చెందిన వ్యక్తి దేపావత్ రాజేశ్ తండ్రి తుల్చ పేరుగల ఓటరును పంచాయతీ కార్యదర్శి, బీఎల్వో పొరపాటు వల్ల పేరూరు పంచాయతీలో ఓటరుగా నమోదైంది. తుల్చ భార్య ఓటు మాత్రం వీర్లగడ్డ తండా పంచాయతీలో ఉండటం విశేషం. దీంతో పేరూరు పంచాయతీని ఎస్టీ మహిళకు రిజ ర్వు చేయడంతో ఎన్నికల్లో పోటీ చేసే మహిళా అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. పేరూరులో మొత్తం 792 మం ది ఓటర్లు ఉన్నారు. అందులో 421 మంది మహిళలు, 371 మంది పురుషులు. వీరిలో 665 మంది బీసీ ఓటర్లు కాగా, 107 మం ది ఎస్సీలు. 20 మంది ఓసీ ఓటర్లు ఉన్నా రు. అధికారులు ఎన్నికల జాబితాలో ఎక్క డా ఎస్టీ ఓట్లను చూపించలేదు. కానీ పంచాయతీని మాత్రం ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పిదం వల్ల పరిపాలించుకునే భాగ్యానికి నోచుకోలేకపోతున్నామని గ్రామ స్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.