మునుగోడు, సెప్టెంబర్ 29 : మునుగోడు మండల పెన్షనర్ల సంఘం నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండోజు పుల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా గాదరి శరణార్థి, కోశాధికారిగా నకిరేకంటి అంజయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.సీతారాములు, కె.రంగారెడ్డి, అంజమ్మ, డి.సాయిలు, జి.యాదగిరిరెడ్డి, ఎన్.ఎల్లయ్య ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పుల్లయ్య మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.