Miryalaguda : హెల్మెట్ నిర్లక్ష్యంతో ప్రాణాపాయం : ఎస్పీ శరత్ చంద్ర పవార్
వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ అనే నినాదంతో..
మిర్యాలగూడ, జనవరి 10 : వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ అనే నినాదంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైకర్లకు ఉచిత హెల్మెట్ల పంపిణీని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణతో కలిసి అందజేసి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులకు రక్షణ కవచం హెల్మెట్ అన్నారు. రోడ్ల పైన మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ ఉన్నట్లయితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అన్నారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయడం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించి పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, సిఐలు నాగభూషణ్ రావు, వెంకట నరసయ్య, పి ఎన్ డి ప్రసాద్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

