
ఆత్మకూర్(ఎస్)/చివ్వెంల, నవంబర్ 28 : ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కార్తిక మాసం పురస్కరించుకొని ఆదివారం ఆత్మకూర్(ఎస్)మండలంలోని పాతసూర్యాపేట స్టేజీ వద్ద గల సంతోషిమాత ఫలవృక్ష క్షేత్రంలో నిర్వహించిన కార్తిక వన సమారాధన మహోత్సవంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. సంతోషిమాత ఆలయంలో కాశీ నుంచి తెచ్చిన 108 శివలింగాలకు రుద్రాభిషేకం, దిపోత్సవం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, గోపూజ, పార్థివ లింగాభిషేకం, గంగానది దిపోత్సవం నిర్వహించారు. అనంతరం ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూజల్లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ లలిత, వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కొణతం సత్యనారాయణరెడి, వైస్ చైర్మన్ జానయ్య, పార్టీ మండలాధ్యకుడు తూడి నర్సింహారావు, పన్నాల సంజీవరెడ్డి, బత్తుల ప్రసాద్, బెల్లంకొండ యాదగిరి, అలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే చివ్వెంల మండలం దురాజ్‌పల్లి శివారులోని వివేకానంద వృద్ధాశ్రమంలో సూర్యాపేట కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఎన్నికైన టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణను సన్మానించారు. కార్యక్రమంలో కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ, వెన్న చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు బాషా, లక్ష్మి, కోడి సైదులు, శ్యాం, పావనీ కృపాకర్, స్వరూపారాణి, రమేశ్, నెమ్మాది భిక్షం, రవీందర్, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.